పవన్ వర్సెస్ బాలకృష్ణ: రెండోసారి సంక్రాంతి బరిలో..!

0

ఒకప్పుడు సంక్రాంతి పందెంలో చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు పోటీపడేవి. ఆ పోటీ ఎంతో రసవత్తరంగా సాగేది. మాస్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా థియేటర్లను ముంచెత్తేవారు. అయితే అవి పాత రోజులు. ఇప్పుడు వార్ అంతా సోషల్ మీడియాల వరకు ఆన్ లైన్ టికెటింగ్ వరకే పరిమితమైంది. అభిమానుల్లో పరిణతి కనిపిస్తోంది.

ఇకపోతే చిరంజీవి- బాలయ్య వార్ తర్వాత పవన్ వర్సెస్ మహేష్ వార్ గురించి ఆసక్తిగా మాట్లాడుకునేవారు అభిమానులు. కానీ ఆ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆపడం చూశాం. ఇకపోతే 2021 సంక్రాంతి సన్నివేశం మాత్రం విచిత్రంగా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఈసారి సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. నటసింహా నందమూరి బాలకృష్ణ మధ్య పోటీ షురూ కానుందని అంచనా వేస్తున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ ని సంక్రాంతి రిలీజ్ కే దిల్ రాజు ప్లాన్ చేస్తుండగా బాలయ్య – బోయపాటి కాంబినేషన్ మూవీని అప్పుడే రిలీజ్ చేయాలన్న సంకల్పం ఉందట. సంక్రాంతి నాటికి వ్యాక్సిన్ వచ్చేస్తే కరోనా భయం ఉండదన్న అంచనా నిర్మాతల్లో ఉందట. జనవరి 15న బాలకృష్ణ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా.. పవన్ `వకీల్ సాబ్` ను జనవరి 14న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇక బాలకృష్ణ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ వినిపించినా ఇంకా అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దసరాకి టైటిల్ ని ప్రకటించే వీలుందట. సింహా- లెజెండ్ తర్వాత బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బోయపాటి ట్రై చేస్తున్నారు. సంక్రాంతి బరిలో వస్తే అది నెరవేరుతుందనే భావిస్తున్నాడట. ఇంతకుముందు పవన్ నటించిన అజ్ఞాతవాసితో బాలయ్య బాబు నటించిన జై సింహా 2018 సంక్రాంతి బరిలో పోటీకొచ్చింది. ఇప్పుడు రెండోసారి సంక్రాంతి బరిలో ఆ ఇద్దరి సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కానున్నాయి.