సుశాంత్ : వారికి కంగనా సూటి ప్రశ్న

0

సుశాంత్ మృతి బాలీవుడ్ మొత్తంను షేక్ చేసింది. అయితే ఈ షేకింగ్ కొన్ని రోజులే ఉంటుందిలే అనుకుంటే ఆ షేకింగ్ ను కంగనా కంటిన్యూ అయ్యేలా చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా సుశాంత్ మృతికి కారణం బాలీవుడ్ ప్రముఖులు అంటూ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాల్లో వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈ కేసులో బాలీవుడ్ మాఫియా ప్రధానంగా ఉన్నట్లుగా కంగనా ఆరోపిస్తుంది. ఈ కేసును ఖచ్చితంగా సీబీఐకి అప్పగించాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ వచ్చింది. సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ సాగిన సోషల్ మీడియా ఉద్యమంలో కంగనా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎట్టకేలకు సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించింది. దాంతో ఈ కేసులోకి సీబీఐ దిగింది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు సుశాంత్ కేసు విషయంలో అమితాబచ్చన్ కాని కరణ్ జోహార్ కాని ఎందుకు స్పందించడం లేదు అంటూ ప్రశ్నించింది. ఎంతో మంది సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తుంటే వీళ్లు మాత్రం ఎందుకు ఆ డిమాండ్ చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించింది.

సుశాంత్ విషయంలో స్పందిస్తే తన రెప్యుటేషన్ దెబ్బ తినడంతో పాటు తన గురించి ఇండస్ట్రీలో కొందరు తప్పుగా అనుకుంటారనే భయంతోనే అమితాబచ్చన్ అంతటి స్టార్ కూడా స్పందించేందుకు ముందుకు రాలేదు. అలాంటిది సామాన్య నటీనటులు ఎలా ముందుకు వస్తారని కంగనా అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ విషయంలో అమితాబచ్చన్ పేరును కూడా లాగేసిన కంగనా ముందు ముందు మరెంత మంది పేర్లను లాగుతుందో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు.