కంగనతోనే పెట్టుకున్నాడు! ఇక నాన్ స్టాప్ బాక్సింగే!!

0

కొన్ని సెకన్లు నిమిషాల్లోనే ప్రత్యర్థిపై వేగంగా పంచ్ లు కురిపిస్తూ రింగ్ లో బాక్సర్లు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందుకు భిన్నంగా మాటల తూటాలు పేలుస్తూ.. పంచ్ లు విసురుతూ వైరి వర్గాల తాట తీయడం కంగనకు వెన్నతో పెట్టిన విద్య.

అయితే ఇప్పుడు ఓ యువ బాక్సర్ ఏకంగా కంగన అండ్ కోతోనే పెట్టుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా యంగ్ బాక్సర్ అంటే.. ఇంకెవరు.. ఒలింపిక్స్ పథక విజేత విజేందర్ సింగ్. పంజాబీ గాయకుడు కం నటుడు దిల్జీత్ కి మద్ధతు పలుకుతూ అతడు ఏకంగా కంగననే కెలికాడు. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేసి ఇలా చేస్తున్నారు! అంటూ కంగనను తప్పు పట్టే ప్రయత్నం చేశాడు విజేందర్.

దిల్జిత్ దోసంజ్పై కంగనా రనౌత్ వ్యాఖ్యలపై విజేందర్ సింగ్ కొన్ని నినాదాలు చేశారు. ఉత్తర భారతదేశం అంతటా కొనసాగుతున్న రైతు నిరసనల గురించి గాయకుడు కం నటుడు దిల్జిత్ దోసంజ్ ట్విట్టర్ లో వ్యాఖ్యను జోడించగా.. దానికి కౌంటర్ గా కంగన వరుస ట్వీట్లు చేయడం సంచలనమైంది. కంగన వర్సెస్ దిల్జీత్ ఎపిసోడ్ తీవ్రంగానూ మారింది.

అయితే దిల్జీత్ తో గొడవకు దిగిన కంగన పై బాక్సర్ విజేందర్ సింగ్ విరుచుకుపడ్డారు. తప్పుడు వ్యక్తులతో స్నేహం వల్ల కంగన గందరగోళంలో పడిందని వ్యాఖ్యానించారు. దానికి కంగన రిప్లయ్ ఇచ్చారు. “క్యున్ తు భీ శివసేన బనాయేగా ….. భాయ్ (ఎందుకు మీరు కూడా శివసేన తో కలిసి పని చేయాలనుకుంటున్నారా?) అని ప్రశ్నించగా… శివసేన ఇప్పటికే ఉంది.. మంచి పనులు చేస్తోంది అంటూ విజేందర్ బదులిచ్చారు.

కంగనా మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంతో మాటల యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో విజేందర్ ఆ పార్టీకి మద్ధతు పలకడంపై యువతరంలో చర్చ సాగుతోంది. సినీ సోదర సభ్యులైన స్వరా భాస్కర్- మికా సింగ్- రిచా చద్దా తదితరులు దిల్జీత్ కి మద్ధతుగా కంగనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.