
Kangana Ranaut Fired On Aamir Khan Over meeting Turkey Prime Minister
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ దేశానికి వెళ్లిన అమిర్ ఆ దేశ ప్రధానమంత్రి ఎమిన్ ఎర్డోగాన్ను కలిసి వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే ఈ విధంగా అమిర్.. టర్కీ మహిళా ప్రధానిని కలవడం పై నెట్టింట నెటిజన్లు విమర్శలను సంధిస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడు పాకిస్తాన్ దేశానికి వత్తాసు పలికిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారతదేశంలో స్టార్ నటుడిగా పాపులారిటీ పొందిన ఆమిర్ ఇలా ఆమెను కలిసి ఉండకూడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ప్రతీ విషయం పై స్పందించే ఫైర్ బ్రాండ్ కంగనా.. తాజాగా హీరో ఆమిర్ ఖాన్ తీరును ఎత్తిపొడిచింది. అమిర్ చేసింది ఆందోళన కలిగించే విషయమని.. దీనిపై ఆమిర్ వెంటనే స్పందిస్తే బాగుంటుందని కోరింది కంగనా. ఓ సినిమాల పరంగా సామాజిక బాధ్యతలు కలిగిన పౌరుడిగా.. నీ ఫాలోయర్లకు ఐకాన్లా వెలుగుతున్న అమిర్ఖాన్ ఇప్పుడు కపటదారిలా మారారంటూ ఫైర్ అయింది.
అమిర్ చేసిన విషయం పై చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయని అతని చర్యలు చాలామందిని బాధ పెడుతున్నాయని ట్వీట్ తో బాంబ్ పేల్చింది. 1994లో టామ్హాంక్స్ హీరోగా రూపొందిన హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’. అయితే చిత్రానికి రీమేక్గా ‘లాల్సింగ్ చద్దా’ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా 2021 క్రిస్మస్ కానుకగా విడుదల కానుందట. ఇక షూటింగ్ నిమిత్తం ఆమిర్ ఖాన్ టర్కీకి వెళ్లాడట. ఈ క్రమంలో టర్కీ ప్రధానమంత్రి ఎమిన్ ఎర్డోగాన్ను ఇస్తాంబుల్లోని హుబెర్ మాన్షన్లో కలిశాడట. ఇక వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఎమిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్గా మారి అందరి కంట్లో పడ్డాయి. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే ఆ దేశ ప్రధానితో మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమిర్ఖాన్ తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇదిలా ఉండగా.. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి అమిర్ స్పందన ఎలా ఉండబోతుందో..!!
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
