చీరలోనూ అదిరింది

0

Poojitha Ponnaada Latest Gorgeous Look In Saree

విశాఖపట్నంకు చెందిన పూజిత పొన్నాడ తెలుగు సినిమాల్లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సాదారణంగా అయితే తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఎక్కువ ఆఫర్లు దక్కవు. కాని ఈ అమ్మడు ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగా ఉండటంతో పాటు వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకుని కెరీర్ లో ముందుకు వెళ్తుంది. అందుకే ఈమెకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బిజీగా ఉండి కూడా వెబ్ సిరీస్ లను చేస్తున్న ముద్దుగుమ్మ పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది.

పూజిత పొన్నాడ ఎప్పుడూ మోడ్రన్ డ్రస్ ల్లో స్కిన్ షో చేస్తూ ఉంటుంది. ఈసారి కాస్త విభిన్నంగా అన్నట్లుగా ఉండాలనుకుందో ఏమో కాని బ్లాక్ రెడ్ వైట్ కాంబో చీర కట్టింది. చీర కట్టులోనూ ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో ఫొటోలు షేర్ చేసింది. కాని ఈసారి కనీసం నడుము కూడా కనిపించకుండా క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అందాలు చూపించకున్నా కూడా చీర కట్టులోనూ పూజిత పొన్నాడ చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రంగస్థలం చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంది. తెలుగు మరియు తమిళం కలిపి ఈమె వచ్చే ఏడాది నాలుగు అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.