ఏం చేసినా ఆమెలో ఫైర్ మాత్రం తగ్గడం లేదు!

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె తీరు చూస్తుంటే హేమా హేమీలకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్స్ ను మాత్రమే టార్గెట్ చేసింది. తనను ఒక్క మాట అంటే అవతలి వారిని పది మాటలు అనకుండా ఊరుకోని తత్వం కంగనాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కంగనాను ఎందుకు కెలకడం అంటూ చాలా మంది ఆమె విమర్శలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. కంగనాను కేవలం బాలీవుడ్ వారిపైనే కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ఏకంగా సోనియా గాంధీపై కూడా విమర్శలు చేస్తున్నారు.

ఈమెను ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ కంగనాను శివ సేన కార్యకర్తలు హెచ్చరించారు. శివసేన ప్రభుత్వం ఆమెను ఇప్పటికే టార్గెట్ చేసి ఆమెపై చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె ఆఫీస్ ను కూల్చి వేసేందుకు ప్రయత్నించారు. ఇక ఆమె సినిమాల్లో ఏ ఒక్క దాన్ని కూడా ముంబయిలో చిత్రీకరణ చేయనిచ్చేది లేదని అలాగే మహారాష్ట్రలో సినిమాలను విడుదల కానిచ్చేది లేదంటూ అనధికారికంగా చెబుతున్నారు. ముంబయిలో కంగనా బయట తిరగలేని పరిస్థతి ఉంది.

ఇంత జరుగుతున్నా కూడా ప్రతి రోజు మహా సీఎం ఉద్దవ్ ఠాక్రేను రెచ్చ గొట్టేలా మాట్లాడటంతో పాటు తనను ఏం చేయలేరు అంటూ విమర్శలకు మరింతగా పదును పెడుతోంది. ప్రభుత్వం అంతగా టార్గెట్ చేసినా కూడా కంగనాలో ఫైర్ తగ్గక పోవడంపై పలువురు పలు రకాలుగా అభివర్ణిస్తున్నారు. ఇటీవలే విశాల్ ఆమెను భగత్ సింగ్ తో పోల్చడం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా కొందరు కూడా ఆమెలోని ఫైర్ ను అభినందిస్తున్నారు.