ఎనర్జీ చూపించడానికి రెడీ అవుతున్న మంచు హీరో…!

0

ఎనర్జటిక్ హీరో మంచు మనోజ్ చాలా వరకు తన సినిమాల్లో రియలిస్టిక్ ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడని విషయం తెలిసిందే. అందుకే రిస్కీ ఫైట్స్ ని తనే స్వయంగా కంపోజ్ చేసుకుంటూ డూప్ లేకుండా స్టంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన మంచు హీరో మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్లున్నాడు. లేటెస్టుగా మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోతో తిరిగి వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లుగా అర్థం అవుతోంది. ఈ ఫొటోలో ఎర్లీ మార్నింగ్ మనోజ్ తన ట్రైనర్ తో కలిసి ఓ హై కిక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. అందరికీ శుభోదయం తెలిపిన మనోజ్ ‘రైజ్ అండ్ షైన్’ అని క్యాప్షన్ పెట్టాడు.

కాగా కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిద్యభరితమైన చిత్రాలు చేస్తూ వస్తున్న మంచు మనోజ్ నుంచి ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మరో మూవీ రాలేదు. అయితే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన మళ్ళీ ”అహం బ్రహ్మాస్మి” సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన ఎనర్జీని చూపించడానికి సిద్ధమయ్యారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని మంచు మనోజ్ – నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే స్టార్ట్ కాబోతోందని సమాచారం.