హైదరాబాద్ లో అడుగు పెట్టిన ఫైర్ బ్రాండ్

0

సుశాంత్ మృతి చెందినప్పటి నుండి కంగనా రనౌత్ పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంది. ఆమె అంతకు ముందే ఫైర్ బ్రాండ్ అంటూ పేరు దక్కించుకుంది. గత మూడు నాలుగు నెలలుగా ఆమె చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఆమె ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేనే ఢీ కొట్టడంతో ఆమె ఆఫీస్ ను ప్రభుత్వం కూల్చి వేసిన విషయం తెల్సిందే. ముంబయిని వివాదాస్పద పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడం వల్ల కూడా ఆమెపై మహా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించింది. నేడు ఆమె ట్విట్టర్ లో తన సినిమా షూటింగ్ విషయమై అధికారిక ప్రకటన చేసింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవిలో కంగనా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు కంగనా వచ్చిందట. ఆ సినిమా షూటింగ్ బ్యాలన్స్ వర్క్ ను పూర్తి చేసేందుకు గాను హైదరాబాద్ లో చాలా నెలల తర్వాత అడుగు పెట్టింది. ఈ సందర్బంగా కంగనా ట్విట్టర్ లో ఏడు నెలల తర్వాత నేను సౌత్ ఇండియాకు వెళ్లబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నేను షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. తలైవి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్న నాకు మీ ఆశీర్వాదాలు కావాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ విపత్తు సమయంలో షూటింగ్ కు వెళ్తున్నందున మీ అందరి ఆశీస్సులు ఉండాలంటూ కోరింది. తలైవి సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో తమిళంతో పాటు తెలుగు హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.