చందన బొమ్మన కాదు కంగనా శారీస్ .. ఎక్కడంటే !

0

కంగనా .. ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. హీరోయిన్ గా కంగనా తిరుగులేని స్టార్ డం సంపాదించుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఆమె కట్టు..బొట్టుతోపాటు కాంట్రవర్శీ అదే రేంజ్లో ఉంటోంది. మణికర్ణిక మూవీతో యమా పాపులర్ అయిన ఈ బాలీవుడ్ బామ సుశాంత్ సూసైడ్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంతో విభేదించడంతో భారీగా క్రేజ్ పెరిగిపోయింది. కంగనాకు ఉన్న క్రేజ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.

తెలుగువారికి చందన శారీస్ తెలుసు. బొమ్మన శారీస్ కూడా తెలుసు. అయితే ఇప్పుడు కొత్త చీరలు వచ్చాయి. గుజరాత్ లోని సూరత్ కు చెందిన వస్త్ర వ్యాపారులు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కంగనా చీరలు తయారు చేశారు. మణికర్ణిక సినిమాలో కంగనా రనౌత్ ఫొటోను ప్రింట్ చేశారు. ‘ఐ సపోర్ట్ కంగనా రనౌత్’ అంటూ ప్రింట్ చేశారు. కంగనా రనౌత్ బ్యాక్ గ్రౌండ్ లో వినాయకుడి బొమ్మను ముద్రించారు. గుజరాత్ లోని సూరత్ దేశంలో ప్రముఖ వస్త్ర వ్యాపార కేంద్రం. దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి వస్త్రాలు సరఫరా అవుతుంటాయి. గతంలో నరేంద్ర మోదీ ప్రియాంకా చోప్రా స్వచ్ఛభారత్ కరోనా జాగృతి అభియాన్ పేరుతో కూడా ఇక్కడి వ్యాపారులు చీరలు ప్రింట్ చేశారు.