వారసురాలికి పోటీగా కంగనా కూడా..!

0

ఈమద్య కాలంలో ఇండియన్ ఆర్మీపై వరుసగా సినిమాలు వస్తున్నాయి. దేశ భక్తిని కలిగి ఉండటంతో ప్రేక్షకులను ఈజీగా సినిమా వైపు ఆకర్షించవచ్చు అనేది మేకర్స్ ప్లాన్ అయ్యి ఉంటుంది. ఈమద్య వచ్చని ‘యూరి’ ఇంకా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. కనుక మరిన్ని సినిమాలను తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా ఆర్మీపై సినిమాలు వస్తున్న కారణంగానే విడుదలకు ఇండియన్ ఆర్మీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాల్సిందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇటీవలే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి జాన్వీ విమర్శలు ఎదుర్కొంది. జాన్వీ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు ఆమె నటన కూడా చాలా వీక్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ను జాన్వీ చవి చూడాల్సి వచ్చింది. జాన్వీ సినిమాకు పోటీ అన్నట్లుగా ఇప్పుడు కంగనా హీరోయిన్ గా ‘తేజస్’ అనే మూవీ ప్రారంభం అయ్యింది.

ఈ సినిమా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోనే రూపొందబోతున్నది. జాన్వీ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించింది. కంగనా కూడా ‘తేజస్’ లో ఎయిర్ ఫైటర్ గా కనిపించబోతుంది. ఈ సినిమాను ‘యూరి’ మేకర్స్ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ తోనే కంగనా మంచి మార్కులు దక్కించుకుంది.

జాన్వీ కపూర్ తో పోల్చితే కంగనా వందకు వంద శాతం ఎయిర్ ఫైటర్ పాత్రకు సూట్ అయ్యిందని కంగనా ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే వారసత్వంతో వచ్చిన వారికి సొంత కష్టంతో వచ్చిన వారికి తేడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ లో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. సినిమాకు సర్వేష్ మేవరా దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ‘తలైవి’ సినిమాను చేస్తున్న కంగనా అది పూర్తి అయిన తర్వాత ‘తేజస్’ షూటింగ్ లో జాయిన్ కాబోతుంది.