వ్వావ్! ..వ్వాటే ఎక్స్ ప్రెషన్స్ ప్రగ్య !!

0

ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. సినిమాల్లేకపోయినా అభిమానులకు నిరంతరం ఏదో ఒక ట్రీట్ ఉంటుంది ఇక్కడ. వేడెక్కించే ఫోటోషూట్లతో నిరంతరం అగ్గి రాజేయడం తనకో హ్యాబిట్ గా మారింది.

ఇటీవల ఇన్ స్టా మాధ్యమంలో ప్రగ్య జైశ్వాల్ వేడెక్కించే జిమ్మింగ్ వీడియోల్ని ఫోటోల్ని షేర్ చేస్తోంది. నిరంతరం బికినీ ఫోటోషూట్లతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ప్రగ్య షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ అంతే హీటెక్కిస్తోంది. వ్వావ్ ప్రగ్య వ్వాటే ఎక్స్ ప్రెషన్స్ అంటూ.. టాక్ యూత్ లో మొదలైంది మళ్లీ. రకరకాల ఉద్వేగాల్ని చక్కని ఎక్స్ ప్రెషన్స్ తో ప్రదర్శించి ఆకట్టుకుంది.

అయినా ఆ ఒక్క ఛాన్స్ కోసమే ఇదంతా. ఇటీవల టాలీవుడ్ లో నిర్మాతల్ని ఆకర్షించలేక నానా యాతనా పడుతోంది ఈ అమ్మడు. జయ జానకి నాయక.. ఆచారి అమెరికా యాత్ర (2018) చిత్రాల తర్వాత తనకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో ఇలా హార్డ్ వర్క్ చేస్తోంది. ఎట్టి పరిస్థితిలో తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని నిరాశపరచని ట్రీటివ్వాలన్న కమిట్ మెంట్ ని మాత్రం చూపిస్తోంది. ఈ శ్రమ ఏదో ఒక రోజు ఫలిస్తుందేమో చూడాలి.