`కపటధారి` కోసం బరిలో దిగిన నాగచైతన్య

0

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `కపటధారి`. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఎంటర్ టైనర్ ఇది. ఇందులో నాజర్- నందిత శ్వేత- పూజా కుమార్- వెన్నెల కిషోర్- జయప్రకాశ్- సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు.

నవంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా `కపటధారి` ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఆగస్టు 24 సాయంత్రం 5 గంటలకు నాగచైతన్య రిలీజ్ చేయనున్నారు. ఆ మేరకు చైతన్య ముఖచిత్రంతో ప్రచారానికి సంబంధించిన పోస్టర్ ని చిత్రబృందం లాంచ్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోని రిలీజ్ చేయనున్నారు.

సుమంత్ కోసం చైతన్య ప్రచారబరిలోకి దిగడం ఆసక్తికరం. కింగ్ నాగార్జున.. సమంత.. అఖిల్ ఇలా వరుసగా కపటధారికి ప్రచారంతో హైప్ తెచ్చే ప్లాన్ చేస్తున్నారట. సైమన్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధనుంజయన్ స్క్రీన్ప్లే అడాప్షన్ చేయగా.. బాషాశ్రీ మాటలు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటర్ గా.. స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్ గా పని చేస్తున్నారు. విదేశ్ ఆర్ట్ డైరెక్టర్గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.