Templates by BIGtheme NET
Home >> Cinema News >> కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న యువ హీరో..!

కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న యువ హీరో..!


యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ”చావు కబురు చల్లగా” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పెగళ్ళపాటి కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజుగా కనిపిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ‘చావు కబురు చల్లగా’ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోతుందని సమాచారం. థియేటర్స్ సక్రమంగా తెరిచిన వెంటనే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అలానే ‘చావు కబురు చల్లగా’ సినిమా తరువాత ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ సినిమాలో నటిస్తున్నాడు కార్తికేయ. ఇందులో ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటితో పాటు తమిళ్ లో అజిత్ హీరోగా నటిస్తున్న ‘వలిమై’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడని సమాచారం. ఏదేమైనా ‘Rx 100’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ ఒక వైపు హీరోగా చేస్తూనే మంచి పాత్రలు వస్తే వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.