అవతార్ కోసం టైటానిక్ హీరోయిన్ అండర్ వాటర్ సాహసం

0

టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న కేట్ విన్ స్లెట్ ప్రస్తుతం అవతార్ సినిమా కోసం అత్యంత కఠినమైన సాహసంను చేసేందుకు సిద్దం అయ్యింది. అవతార్ సినిమా ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్నాడు. అవతార్ సినిమా మొదటి పార్ట్ ను మించిన విజువల్ వండర్ గా ఆయన తెరకెక్కించబోతున్న నాలుగు పార్ట్ లు ఉండబోతున్నట్లుగా ఇప్పటికే చెప్పాడు. మొదటి పార్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు విజువల్ వండర్ ఇప్పుడు రాబోతున్నాయి అంటున్నారు.

అవతార్ రెండవ పార్ట్ కోసం కేట్ విన్ స్లెట్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా కోసం నీటి అడుగు భాగంలో సీన్స్ చిత్రీకరణ జరుపుతున్నారు. అందుకోసం నీటిలో ఏకంగా ఏడు నిమిషాల 14 సెకన్ల పాటు ఆమె ఉండబోతుందట. ఇంతటి సాహసంను ఆమె చేసేందుకు చాలా కాలంగా శిక్షణ పొందింది. అంత సమయం ఆమె నీటిలో ఉండేందుకు సిద్దం అవ్వడం చాలా పెద్ద సాహసంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం డైవ్ ను కూడా నేర్చుకుందట. అవతార్ లో ఇంకా పలువురు ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.