40కి చేరువవుతున్నా టీనేజీ మిసమిసలు

0

వయసు 40కి చేరువవుతున్నా కత్రినలో అందం పెరుగుతోందే కానీ తరగడం లేదు. 37 వయసులో ఈ బ్యూటీ ఇంకా టీనేజీ మిసమిసలతో అగ్గి రాజేస్తోంది. అంతేకాదు కెరీర్ పరంగా పీక్ అంటే ఏమిటో చూపిస్తోంది. సాటి నాయికలకు ధీటుగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో తన స్థానానికి ఎలాంటి ఢోఖా లేదని నిరూపిస్తోంది.

తాజాగా కత్రిన షేర్ చేసిన ఓ ఫోటో నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ ఫోటో అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. డార్క్ ఫోటోగ్రఫీలో ఎలివేట్ చేసిన ఈ ఫోటోలో థై సొగసుల్ని ఎలివేట్ చేస్తూ కత్రిన ఇచ్చిన ఫోజు హీట్ పెంచుతోంది.

జిమ్ యోగాతో పర్ఫెక్ట్ ఫిట్ బాడీని ఎలివేట్ చేయడం ఈ సీనియర్ బ్యూటీకే చెల్లింది. బ్లాక్ షేడ్ లో టూపీస్ కత్రిన అందాన్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది. జీరో తర్వాత టైగర్ జిందా హై- భారత్ చిత్రాల్లో నటించింది కత్రిన. ఇందులో టైగర్ జిందా హై మినహా మిగతావి ఫ్లాపులయ్యాయి. ప్రస్తుతం కత్రినను సూపర్ గాళ్ తరహా పాత్రలో ఎలివేట్ చేస్తూ టైగర్ సిరీస్ దర్శకుడు ఓ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. దీంతో పాటే విక్కీ కౌశల్.. సిద్ధాంత్ వంటి నవతరం హీరోల సరసన ఈ అమ్మడు నటిస్తోంది.