కత్రినా మేడమ్.. కత్రినా మేడమ్ అంతే!

0

సీనియర్ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి తెలియని సినీ ప్రేమికులు ఇండియాలో ఉంటారని అనుకోవడం భ్రమే. పదిహేనేళ్ల క్రితమే ఈ భామ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పట్లో విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాలో నటించగా ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో కత్రినా యాక్టింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే కాలక్రమేణా కత్రినా తన నటనను మెరుగు పరచుకోవడమే కాకుండా డ్యాన్స్ లో కూడా తన సత్తా చాటింది. ఇన్నేళ్ల తర్వాత కూడా బాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగుతోంది.

కత్రినా అంటే గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్. ఏదైనా ఫిల్మీ ఈవెంట్ లేదా ఫ్యాషన్ కు సంబంధించిన ప్రోగ్రామ్ ఉందంటే ఇక కత్రినా వయ్యారం మామూలుగా ఉండదు. అంతర్జాతీయ వేదికలు అయిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లాంటి చోట్ల కూడా కత్రినా పలుమార్లు తన టాలెంట్ చూపించింది. కత్రినా 2015 లో మొదటిసారి 68 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది. ‘లా టెటే హాట్’ అనే సినిమా ప్రీమియర్ ప్రదర్శనకు హాజరైంది. ఎరుపు రంగు డిజైనర్ గౌన్ ధరించి చూపరులను కట్టి పడేసింది.

కేన్స్ ఫెస్టివల్ అనగానే ఎక్కువమంది భామలు అందాల ప్రదర్శనే ముఖ్యం అన్నట్టుగా దుస్తులు డిజైన్ చేయించకుంటారు. కానీ కత్రినా మాత్రం వారికి పూర్తి భిన్నంగా అందాల ప్రదర్శన ఒక ఔన్సు కూడా లేకుండా అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ జనాలు వస్తువులను ప్యాకింగ్ చేసినట్టుగా బాడీని తన అందమైన డ్రెస్సుతో కవర్ చేసింది. నిజానికి ఒంట్లో అందం ఉండాలే కానీ ఎలాంటి డ్రెస్ ధరించినా.. అందాలవిందు చెయ్యకపోయినా అందంగానే ఉంటారు. హాట్ గా కనిపిస్తారు. కత్రినా ఫోటో చూస్తే అది నిజం అనిపించకమానదు. ఐదేళ్ల క్రితం ఫోటో అయినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించడం గ్రేట్ కదా? కేన్స్ వయ్యారం ఎర్ర డ్రెస్సు సింగారం సంగతి పక్కనబెట్టి ఈ బంగారం కొత్త సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ తో ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మార్చ్ 25 న విడుదల కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు.