ఎల్లో స్కర్ట్ లో కవ్విస్తున్న కైఫ్…!

0

కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది. నలభైకి దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి రెచ్చిపోయి ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. మాజీ స్టార్ హీరోయిన్ అయినా అందాల ఆరబోతలో తాజానే అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అమ్మడిని ఆరాధించే రసిక హృదయాలు ఇప్పుడు కైపెక్కించే కత్రినా ఫోటో ఒకటి బయటకి తీశారు. ఈ ఫోటోలో ఎల్లో కలర్ స్కర్ట్ ధరించి వయ్యారంగా ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటో చూస్తే కత్రినాలోని హాట్నెస్ ఏంటో తెలిసిపోతుంది. అసలే కరోనా సమయంలో కరువులో ఉన్న కుర్రాళ్ళు ఈ ఫోటోని వైరల్ చేసేసారు.

ఇదిలా ఉండగా ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కత్రినా వెంకటేష్ హీరోగా వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. వెంటనే బాలకృష్ణతో నటించిన ‘అల్లరి పిడుగు’ ప్లాప్ అవడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వస్తున్నా వారందరికి పోటీనిస్తూ దూసుకుపోతోంది. ఇక సల్మాన్ ఖాన్ – రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపి అప్పట్లో సంచలనమే రేపింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తోందని బీ టౌన్ కోడై కూస్తోంది. కాగా ఈ మధ్య కత్రినా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొడుతున్నాయి. ఈ బ్యూటీ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ‘భారత్’ ‘జీరో’ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అవకాశాలకు దూరంగా ఉండిపోయింది. కత్రినా కైఫ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి – అక్షయ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తోంది.