నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..

0

కరోనాతో పోరాడుతున్న గాన గంధర్వుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి బులిటెన్ రిలీజ్ చేసింది. ఆయన కోలుకోనప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది.

కాగా ఇదే విషయాన్ని ఎస్పీ బాలు తనయుడు చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితిలో మార్పులేదని అని కన్నీళ్లు పెట్టుకున్న చరణ్.. ఈరోజు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని గుడ్ న్యూస్ చెబుతూ వీడియో మెసేజ్ ను విడుదల చేశారు. నిన్న ఆరోగ్యం విషమంగా ఉన్నా.. ఈరోజు నిలకడగా ఉందని పేర్కొన్నారు. నాన్న ప్రాణాధారాలు బాగా పనిచేస్తున్నాయని ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. పూర్తిగా కోలుకున్నాడని కాదు కానీ.. కోలుకుంటున్నాడన్నారు. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం.. ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని చరణ్ వీడియోలో వెల్లడించారు.

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోజు నుంచి వెంటీలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తున్నారు.