Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆర్ఎఫ్ సీ లో కేజీఎఫ్ హంగామా..

ఆర్ఎఫ్ సీ లో కేజీఎఫ్ హంగామా..


కేజీఎఫ్.. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూట్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన బంగారు గనుల సెట్లో జరుగుతోంది.

తాజాగా.. క్లైమాక్స్ లోని భారీ యాక్షన్ సీన్ షూట్ చేశారు. ఇందులో హీరో శాండల్వుడ్ స్టార్ యశ్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లిక్ మనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న కేజీఎఫ్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన గుడ్ న్యూస్ ను డిసెంబర్ 21 న అధికారికంగా అభిమానులతో పంచుకుంటామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ మూవీ టీజర్ జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి ప్రకాష్ రాజ్ రవీనా టాండన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా విజయ్ కిరాగండూర్ వ్యవహరిస్తున్నారు.