బెల్ బాటమ్ కనకమ్మ పరేషానులే

0

ప్రతిసారీ ఫ్యాషన్ పోకడలు మారుతూనే ఉంటాయి. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి వెళ్లే కొద్దీ ట్రెండ్ మారిపోతుంటుంది. అపుడెపుడో 80లలో బెల్ బాటమ్ స్టైల్ గురించి ఎంతో వింతగా వెరైటీగా మాట్లాడుకునేవారు. ఏఎన్నార్ ఎన్టీఆర్ రోజుల్లో కనిపించిన బెల్ బాటమ్ నే నాగార్జున .. బాలయ్య తొడుక్కుంటే అదో వెరైటీ. ఇక అందాల కథానాయికలు సుహాసిని… సరిత.. జ్యోతిలక్ష్మి.. పట్నం వచ్చిన పతివృతలు తొడుక్కుంటే ఆ లుక్కే వేరుగా ఉండేది.

ఆ ట్రెండ్ ని అందరూ మర్చిపోయారు అనుకుంటుండగానే ఇటీవలి కాలంలో మరోసారి బెల్ బాటమ్ ని వైరల్ చేసింది ఫ్యాషన్ ప్రపంచం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ తరహాలో బెల్ బాటమ్ దూసుకుపోయింది. మొన్న కేజీఎఫ్ లోనూ యష్ బెల్ బాటమ్ తో ఓచోట కనిపించే సరికి వెరైటీనే అనిపించింది.

అదంతా సరే కానీ.. ఇదిగో ముంబై ర్యాంప్ ని గడగడలాడిస్తున్న కియరా అద్వాణీని చూశారుగా.. బెల్ బాటమ్ కనకమ్మలా ఏం లుక్కిచ్చిందో! ఇది డెనిమ్ జంప్సూట్. అనుష్క శర్మ నుంచి కియరా వరకూ ప్రతి భామా ఈ తరహా స్టైలింగ్ ని ఇష్టపడుతుంటారు. ఇక అనుష్క శర్మను ఫాలో చేస్తూ అక్కినేని కోడలు సమంత ఇంతకుముందు బెల్ బాటమ్ లో డెనిమ్స్ లో కనిపించారు. పోనీ టైల్ స్టయిల్.. టోన్డ్ లిప్ స్టిక్ .. కాంబినేషన్ చెవిపోగులు ఓవరాల్ గా కియరా రూపాన్ని పూర్తి గా మార్చేశాయి!

ఇక కియారాని అనుష్క శర్మతో పోల్చేస్తున్నారు. అధునాతన అంశాల పరంగా పోల్చితే అనుష్క స్టైలింగ్ చాలా పరిణతి చెందినది. కాగా కియారా సంచలనాలకు తావిచ్చేదిగా కనిపిస్తోంది.