మండే ఎడారిలో ఒయాసిస్సు నీవు కియరా

0

కియారా అద్వానీ సౌత్ నార్త్ రెండు చోట్లా పాపులర్ హీరోయిన్ అన్న సంగతి తెలిసినదే. బాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలు దర్శకనిర్మాతలకు హాట్ ఫేవరెట్ గా వెలిగిపోతోంది. `లస్ట్ స్టోరీస్`… కబీర్సింగ్… గుడ్ న్యూజ్ వంటి చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుని బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న `లక్ష్మీబాంబ్` చిత్రంలో నటిస్తోంది. `కాంచన` ఆధారంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు.

హారర్ థ్రిల్లర్ కథాంశంతో కామెడీని మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేయగా వైరల్ అయ్యింది. తెలుగు- తమిళ వెర్షన్లకు కొంత భిన్నంగా ఎక్స్ట్రా ఎంటర్ టైన్ మెంట్ ని..హారర్ అంశాలనీ జోడించి తెరకెక్కించడంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు.

`బూర్జ్ ఖలీఫా …` అంటూ సాగే ఈ పాటని అక్షయ్ కుమార్ – కియారా జంటపై చిత్రీకరించారు. అనార్కలీ తరహా కాస్ట్యూమ్స్ ధరించి హీటెక్కించే అందాలతో కియారా కనిపించబోతోంది. ఈ పాట ని దుబాయ్ ఎడారిలో చిత్రీకరించారు. ఎర్రటి ఎండలో హీటెక్కించే అందాలతో చెప్పులు లేకుండా కియారా డ్యాన్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూళ్లలో ఆనందించదగ్గ షెడ్యూల్ దుబాయ్. ఈ షెడ్యూల్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యాన్సీ ఔట్ ఫిట్ లో ఈ పాటని చేయడం జరిగింది. మంచు కొండల్లో షిఫాన్ సారీలో డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఈ ఎడారిలో కాళ్లకి చెప్పులు లేకుండా నటించడం అంతే కష్టం` అని చెబుతోంది.