సన్నజాజి తీగ నడుము సిన్నదానా.. నీలో సానా ఉందమ్మోవ్

0

లాక్ డౌన్ పుణ్యమా అని సోషల్ మీడియాలో ఫ్యాషన్ షోలు సునామీలా పోటెత్తుతున్నాయి. వద్దు మొర్రో అన్నా కథానాయికలు అస్సలు వినడం లేదు. వేడెక్కించే ఫోటోషూట్లతో వెంటపడి మరీ అందాల విందును వడ్డిస్తున్నారు. వారానికో పిచ్చెక్కించే ఫోటో గ్యాలరీతో ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తున్నారు. లారెన్స్ హీరోయిన్ వేదిక కూడా ఇదే పనిలో యమ బిజీగా వుంది. లారెన్స్ `ముని`.. నారా రోహిత్ `బాణం` వంటి చిత్రాలతో హామ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. దానివల్ల కెరీర్ పరంగా పని జరక్కపోవడంతో ఈ బ్యూటీ ట్రాక్ మార్చింది.

గ్లామర్ డోస్ ని పెంచేస్తూ అందాల విందుకు రెడీ అయిపోతోంది. `కాంచన 3`తో విజయం అందుకున్న ఈ భామకు బాలయ్య `రూలర్`లో అవకాశం ఇచ్చారు. ఎన్నో ఆశలుపెట్టుకున్నా రూలర్ వర్కవుట్ కాకపోవడంతో ప్రస్తుతం కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. అయితే తెలుగు- తమిళ భాషల్లో రూపొందుతున్న `జింగిల్` మూవీపై ఈ అమ్మడు భారీ ఆశలుపెట్టుకుంది. ప్రీప్రొడక్షన్ దశలో వున్న ఈ మూవీలో వేదిక రచ్చ చేయబోతోందట.

ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా ఇన్ స్టా వేదికగా సాటి నాయికల్లానే వేదిక కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వారానికో పిచ్చెక్కించే ఫోటోతో సందడి చేస్తోంది. తాజాగా చీరలో హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. నాజూకు నడుమందాలని ప్రదర్శిస్తూ హీటెక్కిస్తోంది. వేదిక నడుమందాలు చూసిప నెటిజన్స్ అది సన్నజాజి తీగా లేక నడుమా అంటూ అవాక్కవుతున్నారు. వేదిక ఇంతకుముందు నారా రోహిత్ సరసన బాణం లాంటి క్లాసిక్ చిత్రంలోనూ నటించింది.