పవన్ తో సినిమా క్యాన్సిల్ పై క్రిష్ క్లారిటీ

0

పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా పవన్ ఓకే చెప్పాడు. ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ ఏడాదిలో వకీల్ సాబ్ మరియు క్రిష్ మూవీలో విడుదల చేయాలనుకున్నారు. వచ్చే ఏడాదిలో హరీష్ శంకర్ మూవీతో పవన్ వస్తాడని ప్రచారం జరిగింది. అనూహ్యంగా కరోనా కారణంగా షూటింగ్స్ జరగలేదు సినిమాలు విడుదల కాలేదు.

వకీల్ సాబ్ వచ్చే ఏడాది వరకు వచ్చే అవకాశం కనిపిండం లేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో మూవీ ఎప్పుడు పట్టాలెక్కేనో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో క్రిష్ కొత్త సినిమా వైష్ణవ్ తేజ్ తో ప్రకటించాడు. దాంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవన్ తో మూవీ క్యాన్సిల్ అవ్వడం వల్లే వైష్ణవ్ తేజ్ తో సినిమాను క్రిష్ మొదలు పెట్టాడంటూ ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ ల మూవీ ఇక ఉండక పోవచ్చు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది.

దర్శకుడు ఈ విషయమై స్పందించాడు. పవన్ తో నా సినిమా క్యాన్సిల్ అయిన విషయం నిజం కాదు. మా సినిమాకు పవన్ కళ్యాణ్ బల్క్ డేట్లు ఇచ్చారు. వకీల్ సాబ్ మూవీ ఎప్పుడేతే షూటింగ్ పూర్తి అవుతుందో వెంటనే మా సినిమా ప్రారంభం అవుతుందని క్రిష్ పేర్కొన్నాడు. ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. వైష్ణవ్ తేజ్ సినిమాను కేవలం నెలన్నర రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట.