రాజు గారి చేపల పులుసు

0

కరోనా లాక్ డౌన్ కారణంగా స్టార్స్ చాలా మంది వంటింట గరిట పట్టడం మనం సోషల్ మీడియాలో చూశాం. ఆమద్య చిరంజీవి పెసరట్టు వేసి అమ్మకు తినిపించడం ఆ తర్వాత చేపల కూర కూడా చేయడంతో చిరంజీవి వంటల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. మెగాస్టార్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా వంటింట గరిట తిప్పారు. ప్రత్యేకంగా వీకెండ్ స్పెషల్ గా కృష్ణం రాజు తన ఇంటి కిచెన్ లో చేపల పులుసు చేశారు. ఈ విషయాన్ని ఆయన కూతురు ప్రసీద సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేసి తెలియజేసింది.

డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఈ ప్రపంచంలో ఆయనను మించిన వారు లేరు. పులుసు వాసన చూసి ఉప్పు సరిపోయిందా లేదా అనే విషయాన్ని ఆయన చెప్పగలరు. ఆ విషయంలో నాన్న ఎక్స్ పర్ట్ అంటూ వీడియోను షేర్ చేసింది. కృష్ణం రాజు చేపల పులుసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా నిర్మాణంలో కృష్ణం రాజు భాగస్వామి అనే విషయం తెల్సిందే. సినిమా నిర్మాణ వ్యవహారాల్లో ప్రసీద క్రియాశీలకంగా ఉంటుంది.