బాబోయ్ కృతి కి ఇంత క్రేజ్ ఏంటీ?

0

కొంత మంది హీరోయిన్స్ కు సక్సెస్ లు దక్కినా కూడా తదుపరి సినిమాల ఆఫర్లు రావడానికి చాలా సమయం పడుతుంది. కాని కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మొదటి సినిమా కూడా విడుదల అవ్వకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్కువ శాతం మొదటి తరహా హీరోయిన్స్ ను చూశాం. చాలా మెల్లగా స్టార్ డం వచ్చిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటారు. కాని ఉప్పెన సినిమాలో నటించి ఇంకా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాని కృతి శెట్టి మాత్రం రెండవ తరహా హీరోయిన్ అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది.

మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నీ కళ్లు నీలిసముద్రం పాటలో ఈమె అందంకు ఫిదా అయిన ప్రేక్షకులు తెగ అభిమానిస్తున్నారు. అందుకే ఆమెను తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయ్యింది. ఇప్పటికే ఇద్దరు హీరోలకు ఈమె జోడీగా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ సమాచారం అందుతోంది. నానికి జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా దక్కించుకుంది. ఉప్పెన అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లోపే ఈమెకు ఏకంగా మూడు నాలుగు ఆఫర్లు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంత క్రేజ్ ఏంట్రా బాబోయ్ అంటూ సినీ విశ్లేషకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు.