మరోసారి ఏడిపించిన లాస్య

0

బిగ్ బాస్ ఈ సీజన్ లో బలమైన కంటెస్టెంట్ లో లాస్య ఒకరు అనడంలో సందేహం లేదు. ఆమె చాలా ఏళ్లుగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు తెలుసు. ఆమె చాలా ఆకతాయిగా అల్లరి చేస్తూ చిన్న పిల్లగా ఉంటుంది. ఆమె ఎప్పుడు అల్లరి చేస్తూ అందరితో సరదాగా ఉండటమే ఇన్నాళ్లు మనం చూశాం. కాని బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత లాస్య తన నవ్వు వెనుక ఎంతటి విషాదం ఉందో చెప్పింది. తన బాబును వదిలేసి వచ్చి అప్పుడప్పుడు బాబును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉండే లాస్య ప్రేక్షకులకు కూడా కన్నీరు తెప్పిస్తుంది.

లాస్య ఎప్పుడు నవ్వుతూ హుందాగా కనిపిస్తూ ఉంటుంది. గతంలోనే తన పెళ్లి మొదట కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా జరిగిందని.. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు ఒప్పుకుని మళ్లీ తమ పెళ్లి చేశారు అంటూ లాస్య చెప్పుకొచ్చింది. 2010 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న లాస్య మొదటి రెండు సంవత్సరాలు భర్త మంజునాథ్ కు దూరంగా ఉంటూ వచ్చింది. 2012 నుండి భర్తతో కలిసి ఉంటున్నట్లుగా చెప్పిన 2014లో మొదటి సారి నాన్న ఫోన్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్న విషయం ఎవరికి తెలియదు కనుక మేము మళ్లీ నీ పెళ్లి చేస్తాం. మీ ఇద్దరు ముందు లైఫ్ లో సెటిల్ అవ్వండి అంటూ సూచించాడు.

ఇద్దరం చాలా సంతోషంగా కెరీర్ లో సెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్న సమయంలో 2014లో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లి విషయం ఎవరికి చెప్పక పోవడంతో పాటు కుటుంబ పరంగా కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ సమయంలో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సంఘటన నాకు ఎప్పటికి గుర్తు వస్తుంది. నా మొదటి బేబీని మిస్ అయినందుకు ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. 2017లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తనకు మళ్లీ అబార్షన్ అయ్యింది. 2018లో జున్ను కడుపులో పడ్డాడు అంటూ కన్నీరు పెట్టుకుంటూ గత విషయాలను చెప్పిన లాస్య ప్రతి ఒక్కరిని కదిలించింది.