ఆనాటి నిగనిగలు ఏమయ్యాయ్ హన్సిక?

0

తెలుగులో మంచు కాంపౌండ్ నాయికగా పాపులరైన హన్సిక ఇక్కడ అంతగా కలిసి రాక ఆ తర్వాత అవకాశాల కోసం తమిళ పరిశ్రమ వైపు వెళ్లిపోయింది. అక్కడే సెటిలైంది. శింబు.. జయం రవి.. అరవింద స్వామి .. ధనుష్ వంటి స్టార్లతో అవకాశాలు అందుకుంది ఈ భామ. కానీ నయన్ త్రిష రేంజులో అగ్ర నాయిక అని అనిపించుకోవడంలో మాత్రం విఫలమైంది.

ఏవో తన రేంజుకు తగ్గ సినిమాలు చేసుకుపోతూ డీసెంట్ నాయిక అనిపించుకుంది. ఇటీవల జయంరవి -అరవింద స్వామి కాంబో మూవీ భోగన్ లో నటించింది. ఆ తమిళ హిట్ చిత్రం తెలుగులోనూ రిలీజవుతోంది. అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అందిస్తోంది. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది.

మరోవైపు తన కెరీర్ 50వ సినిమాని పూర్తి చేసిన ఈ భామ బికినీ బీచ్ విహారంతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వెండితెరపైనా హన్సిక బికినీ హీట్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. “ఇప్పటి వరకు నేను బికినీ వేయలేదు. ఇక పై దానికి కూడా నేను రెడీ..! ఈ ఖాళీ టైం లో నా ఫిజిక్ ని బికినీకి తగ్గట్లుగా మార్చుకున్నాను. నా 50వ సినిమా లో ఫాన్స్ కి బికినీ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా“ అని ఇంతకుముందు హన్సిక తెలిపింది.

ఆపిల్ బ్యూటీలో క్వారంటైన్ ఛేంజ్ గురించి ఆసక్తికర చర్చా సాగింది. ఇప్పుడు బికినీ బీచ్ ట్రీట్ తో ఇదిగో ఇలా హీటెక్కిస్తోంది. అలాగే హన్సిక కెరీర్ 50వ సినిమా `మహా` చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కాషాయం ధరించి యోగినిగా మారిన హన్సిక చైన్ స్మోకర్ గా దర్శనమిస్తున్న ఫోటోలు ఇదివరకూ వైరల్ అయ్యాయి. ఇందులో బికినీ ట్రీట్ అదనం. పనిలో పనిగా బికినీ బీచ్ ట్రీట్ కోసం ఇంతగా బరువు తగ్గిపోయి షాకిస్తోంది మరి. కెరీర్ ఆరంభం ఎంతో బబ్లీగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడిలా మారిపోవడం కొందరికి నచ్చడం లేదు మరి.