స్టేజ్ పై సందీప్ ను అన్నా అంటూ నోరుజారేసిన లావణ్య త్రిపాఠి

0

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికలలో లావణ్య త్రిపాఠి ఒకరు. ‘అర్జున్ సురవరం’ తరువాత ఆమె చేసిన సినిమా ‘A1 ఎక్స్ ప్రెస్’. హాకీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆమె సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా అలరించనుంది. మార్చి 5వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకురానున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హిపాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై లావణ్య త్రిపాఠి మాట్లాడింది.

“A1 ఎక్స్ ప్రెస్’ నా మనసుకు బాగా నచ్చిన సినిమా. ఈ కథను వినగానే చాలా కొత్తగా అనిపించింది .. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ఈ సినిమా కోసం నేను ‘హాకీ’ నేర్చుకున్నాను. కోవిడ్ సమయంలో చాలా కష్టాలు పడి ఈ సినిమాను పూర్తి చేశాము. సందీప్ ‘అన్నా’ గురించి చెప్పాలంటే .. అంటూ ఆమె నోరు జారడంతో స్టేజ్ పై ఉన్న రామ్ తో సహా అంతా పెద్దగా నవ్వేశారు. వెంటనే ‘సారీ .. సారీ .. సారీ ఆయన మీకు అన్న .. నాకు ఫ్రెండ్’ అంటూ నవ్వుతూనే లావణ్య కవర్ చేసింది. అయితే వెనకవైపు కూర్చున్న ఫ్యాన్స్ అల్లరి కొంతసేపు కొనసాగింది.

సందీప్ కిషన్ తో నాకు చాలాకాలం నుంచి మంచి పరిచయం ఉంది. ఈ సినిమాలో నా పాత్ర పెర్ఫెక్ట్ గా రావడానికి ఆయన కూడా ఎంతగానో సహకరించాడు. దర్శకుడు .. సంగీత దర్శకుడు ఇద్దరూ కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచారు. ఒక స్పోర్ట్స్ సినిమాకి కావలసిన ఎనర్జీని హిపాప్ తమిళ తన రీ రికార్డింగ్ తో అందించారు. మీరంతా కూడా మొదటి రోజున మొదటి ఆట చూడాలి. సాధారణంగా రామ్ ఎక్కడికీ రారు .. అలాగే ఈ ఫంక్షన్ కి కూడా రాడని అనుకున్నాను. కానీ ఆయన రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది .. సంతోషాన్ని కలిగించింది” అంటూ సందడి చేసింది.