Templates by BIGtheme NET
Home >> Cinema News >> లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్!- పాయల్ రాజ్ పుత్

లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్!- పాయల్ రాజ్ పుత్


2020 ముగుస్తోంది. 2021 కి వెల్ కం చెప్పే టైమ్ ఆసన్నమైంది. 31మిడ్ నైట్ బీచ్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు చాలామంది సెలబ్రిటీలు. మరి అందాల పాయల్ రాజ్ పుత్ ఈసారి సెలబ్రేషన్స్ ఎక్కడ.. ఎవరితో? అంటే అందుకు తాజాగా రివీలైన కొన్ని ఫోటోలే సమాధానమిచ్చాయి.

ఈసారి ఏదో ఎవరికీ తెలీని ఒక రహస్య స్థావరానికి ఆర్.ఎక్స్ 100 బ్యూటీ తన బోయ్ ఫ్రెండ్ తో పాటే వెళ్లిపోయింది. బహుశా ఇది ఫ్యామిలీ ట్రిప్ కావొచ్చు. స్పాట్ నుంచి ఇంతకుముందే వేడెక్కించే ఫోటోషూట్ ని షేర్ చేసింది.

ఇక తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన మరో ఫోటో అంతే వైరల్ గా మారింది. ఈ ఫోటోకి పాయల్ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్! అన్నది పాయల్ రాజ్ పుత్ క్యాప్షన్. నిజమే ఎంత బిజీ లైఫ్ అయినా టెన్షన్ ఫ్రీ అవ్వాలి. లేదంటే అది ఒత్తిడిని పెంచేస్తుంది. పాయల్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. సైలెంటుగా వేరే ఆఫర్లను అందుకుంది. అటు తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది.