యువతరంతో కనెక్ట్ అవ్వడానికి డిజిటల్ మాధ్యమం ఉత్తమమైన మార్గమని మన కథానాయికలు నమ్ముతున్నారు. సమంత.. తమన్నా.. కాజల్ వీళ్లంతా డిజిటల్ పై పెద్ద ప్లానింగ్స్ తో బరిలో దిగుతుంటే యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన వెబ్ సిరీస్ `లైవ్ టెలికాస్ట్`తో OTT రంగంలోకి అడుగుపెడుతోంది. సరోజ లాంటి హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ- తమిళం- తెలుగు అంతటా నటించిన పలువురు స్టార్లు డిస్నీ + హాట్ స్టార్ సిరీస్ లో కనిపించనున్నారు. ఇది ఒక టీవీ సిబ్బంది హాంటెడ్ హౌస్ లో రియాలిటీ షోను చిత్రీకరిస్తున్న క్రమంలో ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
లైవ్ టెలికాస్ట్ కి వెంకట్ ప్రభు రచన తో పాటు దర్శకత్వం వహించారు. తాజాగా లైవ్ టెలీకాస్ట్ ట్రైలర్ రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ వీక్షించిన వారికి ఒకటే సందేహం. చూపించినదే చూపిస్తామంటే ఎవరు చూస్తారు? అన్న ఆసక్తికర ప్రశ్నను కాజల్- వెంకట్ ప్రభు బృందంపై సంధిస్తున్నారు అభిమానులు.
పాత బూత్ బంగ్లాలో దెయ్యం .. ఆ దెయ్యం దెబ్బకు అదిరిపోయే ఇంటి సభ్యులు కాన్సెప్ట్ తెలుగు-తమిళ ఆడియెన్ కి ఇప్పుడే కొత్తేమీ కాదు. ఇంతకుముందు రాఘవ లారెన్స్ తాప్సీతో తెరకెక్కించిన కాంచన 2 కాన్సెప్టునే ఇప్పుడు తిప్పి తీసినట్టు తెలిసిపోతోంది. లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన కాంచన 2లో తాప్సీ టీవీ రిపోర్టర్ గా రియాలిటీ షోను దెయ్యంపై చిత్రీకరించడానికి బయల్దేరాక ఏం జరిగింది? అన్నదానినే ఇప్పుడు కాజల్ తో తిప్పి తీసారు వెంకట్ ప్రభు. అయితే ఇక్కడ ఫ్యామిలీ ఇంటర్ ఫియరెన్స్ కాస్త ఎక్కువ అంతే. అయితే మళ్లీ మళ్లీ ఇలా తిప్పి తీస్తే జనం చూస్తారా? అన్నదే ఇప్పుడు సందేహం. ఓటీటీ ఆడియెన్ మరీ అంత చవకబారు కాదు! అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. అయితే అన్ని విమర్శల్ని ఎదుర్కొని ఓవర్ కం కావాలంటే కచ్ఛితంగా ప్రతి ఫ్రేమ్ ఝడిపిస్తేనే పాజిబుల్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి దీనికి చందమామ ఏమని ఆన్సర్ ఇస్తుందో?