Templates by BIGtheme NET
Home >> Cinema News >> మార్చి 12న రాబోతున్న ‘లవ్ – లైఫ్ – పకోడి’!

మార్చి 12న రాబోతున్న ‘లవ్ – లైఫ్ – పకోడి’!


బిమల్ కార్తీక్ సంచిత జంటగా.. జయంత్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లవ్ – లైఫ్ & పకోడి’. జయంత్ గాలి స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పిస్తున్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలతో మార్చి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ప్రారంభించింది యూనిట్. డిఫరెంట్ గా ఉన్న టైటిల్ తోపాటు ట్రైలర్లోని డైలాగ్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఫిల్ చేస్తున్నాయి.

‘నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీ పక్కనే పడుకోవాలా..?’ ‘పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందిరా పొట్ట తప్ప..’ లాంటి డైలాగులతో సాగిన ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ సినిమా ట్రైలర్.. మారుతున్న యువత ఆలోచనలకు అద్దం పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. సాగర్ వై.వి.వి జితిన్ మోహన్ ఛాయాగ్రాహకులుగా వర్క్ చేశారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కాగా.. ఈ చిత్రం రిలీజ్ కు ఒకరోజు ముందు.. జాతి రత్నాలు శ్రీకరమ్ గాలి సంపత్ విడుదల కాబోతున్నాయి. ఈ విధంగా ఫుల్ కాంపిటేషన్లో బరిలోకి దిగుతున్న ఈ చిత్రం ఎలాంటి రిల్ట్ నమోదు చేస్తుందో చూడాలి.