‘నా 7500 ఎవరు మింగారు.. నా పైసల్ నాకు కావాలే’

0

‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీలత సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తూ వస్తోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ లో కూడా ఉందని.. డ్రగ్స్ లేకుండా అసలు పార్టీలే జరగవని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేసి ”నా డబ్బు కోసం నేను డిమాండ్ చేస్తున్నాను.. నా 7500 రూపాయలు ఎవరు మింగారు” అంటూ పోస్ట్ పెట్టింది.

కాగా మాధవీలత విద్యుత్ బిల్లు చెల్లింపులో తనకు జరిగిన అన్యాయం పై నిలదీస్తూ.. ”ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తగ్గడం లేదు కరెంటు బిల్లులు. మే నెలలో 7500 బిల్లు కట్టాను ఎయిర్టెల్ యాప్ లో.. కానీ కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ 7500 కట్టించుకున్నారు. సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు మెయిల్ పెడితే ‘మేము ఎయిర్టెల్ కి పే చేసాము ‘ అన్నారు. ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ పెడితే సాక్షాలతో సహా మెయిల్ పంపుతూ బిల్లు కట్టాము అన్నారు. మరి నా 7500 ఎవరు మింగారు.. ఎంతమంది బిల్లులు మింగుతారు.. నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక నేను ఉన్న ప్రభుత్వాన్నే అడుగుతున్నా. పవర్ బిల్లు కట్టలేదు అని మళ్ళీ కట్టించుకున్న వాడితో కుమ్మక్కై ప్రజల మీద బిల్లులు రుద్దే ప్రభుత్వాలదా.. ఇపుడు నా 7500 ఎవడు ఇస్తారు” అని ప్రశ్నించింది.

‘డబ్బులెవరికి ఊరికే రావు సర్.. ప్రతి రూపాయి విలువైనదే’ అంటే నీలి రంగు గులాబీ రంగు వాడికి మండుద్ది. ఒకవేళ అంత మండితే నా 7500 నాకు ఇచ్చి అపుడు పెట్రోల్ పోసుకుని మరి మంట తెచ్చుకుని అరవండి. కానీ నా పైసల్ నాకు కావాలె. వాడు తినలే వీడు తినలే అంటే మరి నా పైసల్ ఏడికి పోయినయి ??? ఇలా ఇప్పటికే చాలామంది మీద బిల్లులు మోపారు. డబల్ ధమాకాలు మోపుతున్నారు. ఐనా కడుతున్నాం. ఏమో నాకు తెల్వదు. నా పైసల్ నాకు కావాలి ఎవరిస్తారు. మూడు నెలలైంది.. అన్ని సోర్స్ నుంచి ట్రైల్ చేస్తున్నా అంటూ కేటీఆర్ – సీఎం కేసీఆర్ – తెలంగాణ విద్యుత్ శాఖలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది మాధవీలత. బిల్లు చెల్లించినట్టు అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. అయితే సెక్యురిటీ ఇష్యూస్ వల్ల ఫేస్ బుక్ లో షేర్ చేయలేదని మాధవీలత చెప్పుకొచ్చింది.