అవమానించారు.. కంగనకు నష్టపరిహారం చెల్లించండి!

0

ఎవరికైనా అవమానం అవమానమే. క్వీన్ కంగన రనౌత్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ (బీఎంసీ) అధికారులు కుప్పకూల్చడం అన్యాయమని వాదించేవారి సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. ఒకరకంగా కంగనకు బలం పెరుగుతోందనే చెప్పాలి. బాంద్రాలో అధికారుల అనుమతి లేకుండా మూడు అంగుళాల పాటు ఇంటికి అదనపు హంగులు చేయించుకోవడంతో దానిని బీఎంసీ కూల్చి వేసింది.

అయితే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కంగనను ఓదార్చడమే గాక మీడియా ముందుకు వచ్చి తనకు అండగా నిలిచారు. ఆమెకు అవమానం జరిగిందని నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ముంబైలో నివశించేందుకు భయపడాల్సిన అవసరం లేదని .. ఇది అందరి ఆర్థిక రాజధాని అని అన్నారు. తనకు ఆర్పీఐ పార్టీ మద్ధతు ఉంటుందని ప్రకటించారు.

కంగన జనవరిలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయగా.. మూడు అంగులాళ అధిక స్థలాన్ని బిల్డర్ ఉపయోగించిన విషయం కంగనకు తెలియదని ఆయన అన్నారు. బీఎంసీ అధికారులు అధికంగా ఉన్న భాగాన్ని కూల్చివేసినా ఫర్నీచర్ గోడలు పడిపోయాయని న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. కంగనకు ఇప్పటికే కేంద్రంలోని భాజపా వత్తాసు పలుకుతుంటే ఇప్పుడు ఒకటొకటిగా శివసేన వ్యతిరేక పార్టీలన్నీ కంగనకు మద్ధతు పలుకుతుండడం విశేషం.