అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ కు సంబంధాలా?

0

బాలీవుడ్ అగ్రహీరోలంతా ఖాన్ లు.. వారంతా బీజేపీకి వ్యతిరేకమే.. హిందుత్వ బీజేపీ కూడా ఈ ‘ఖాన్’ త్రయాన్ని వ్యతిరేకిస్తారు. అమీర్ ఖాన్ అయితే బీజేపీపై అప్పట్లో నోరుపారేసుకున్నారు. దీంతో ఖాన్ లను దించేస్తూ బీజేపీ ఇప్పుడు హిందూ హీరో ‘అక్షయ్ కుమార్’ను బాలీవుడ్ లో నెత్తిన పెట్టుకుంటోంది. ప్రధాని మోడీ స్వయంగా అక్షయ్ తో అప్పట్లో ఓ ఇంటర్వ్యూ కూడా చేశాడు. బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న అక్షయ్ పై ఇప్పుడు బిగ్ ‘డి’ బాంబు పడింది? మరి అది నిజమా? కాదా? అసలేంటి ఆ బాంబు? అనేది ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

సెలెబ్రెటీలలో టాప్ పొజిషన్ లో ఉన్న హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయన దూసుకుపోతున్నారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఉన్నారు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయా? అన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అక్షయ్ కుమార్ వ్యక్తిగత లాయర్ అయిన అడ్వకేట్ విబోర్ ఆనంద్ తాజాగా అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని ట్విట్టర్ లో పోస్టు పెట్టడం బాలీవుడ్ లో సంచలనమైంది. ‘అక్షయ్ కుమార్ ఎందుకు వాళ్లను కలిశాడు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ వాళ్లతో అక్షయ్ కుమార్ కు ఏం పని’ అని ట్వీట్ పెట్టారు.

ఆ ఫొటో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు వైరల్ అయ్యింది. అక్షయ్ కుమార్ ను అభిమానించే హిందువులు అంతా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అక్షయ్ కుమార్ ఇలాంటి వాడు అని మేము ఊహించలేదు అని.. మేము సపోర్టు చేస్తేనే అతడు పెద్ద స్టార్ అయ్యాడని.. పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్లతో కలిసి ఫొటో దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో పెద్ద ఎత్తున అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారంట.. మరి అక్షయ్ లాయర్ చేసిన పోస్ట్ లో ఫొటోలు నిజమా? లేక ఫేక్ ఫొటోలా అనేది పూర్తి స్థాయిలో తెలియదు.. కానీ అంతర్జాతీయంగా మాత్రం పెద్ద ఎత్తున ఆ ఫొటో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. చూద్దాం ఏది నిజమో? ఏది అబద్ధమో చూడాలి మరీ..