చెమటలు పట్టిస్తూ నైరా బెనర్జీ..

0

అందానికి అందం.. నట ప్రతిభ ఉన్నా అందరికీ అందలం దక్కేయదు. అది కొందరికి మాత్రమే రాసి పెట్టి ఉంటుంది. ఫేట్ ని డిసైడ్ చేసే పరమాత్మకే కొందరు చెమటలు పట్టిస్తూ స్కై హై కి చేరుతుంటే చాలా మంది ఈ రంగంలో బ్యాక్ బెంచీకే పరిమితమవుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మధురిమను చూశారుగా.. తెరకు పరిచయమై దశాబ్ధం అవుతున్నా ఇంకా కెరీర్ వేటలోనే అలసిసొలసిపోతోంది.

అందంలో కవ్వింతలో సెక్సప్పీల్ లో ఎక్కడైనా తక్కువ ఉందా? కానీ ఏం లాభం .. ? టాలీవుడ్ అస్సలు ఆహ్వానించడం లేదు. చాలా కాలంగా ఈ భామ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నా పిలిచి అవకాశమిచ్చే ఒక్కరంటే ఒక్కరు లేరు.

అపుడెపుడో పెద్ద వంశీ సినిమాలో నటించింది మధురిమ. ఆ తర్వాత తెలుగులో ఆఫర్ అన్నదే లేదు. అయినా సోషల్ మీడియాల ద్వారా హీట్ పెంచుతూ దర్శకనిర్మాతల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏ ప్రయత్నమూ సత్ఫలితాన్ని ఇస్తున్నట్టు లేదు. ఇప్పటికి ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకుంది కాబట్టి ప్రకటనలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందేమో.

`ఆ ఒక్కడు` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై టెంపర్ చిత్రంలోనూ ఓ ఆసక్తికర పాత్రను పోషించింది. అల్లరి నరేష్ -వంశీ కాంబో మూవీ `సరదాగా కాసేపు` లోనూ నాయికగా నటించింది. అటుపై అవకాశాలు తగ్గాక నైరా బెనర్జీ పేరుతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మధురిమ ప్రస్తుతం వెబ్ సిరీస్ (పాతాళ్ లోక్) లతో సరిపెట్టుకుంటోంది. 2019లో ఆపరేషన్ కోబ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. లేటెస్ట్ గా మధురిమ ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే ఎలిజబెత్ టేలర్ కే సిస్టర్ లా ఉందిగా! అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మధురిమ నెవ్వర్ బిఫోర్ స్టన్నింగ్ లుక్ నెటిజనుల్ని మైమరిపిస్తోంది.