మహేష్ తో క్రియేటివ్ డైరెక్టర్ మళ్ళీ కలుస్తున్నాడా..?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ‘1-నేనొక్కడినే’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయితే మహేష్ – సుకుమార్ ప్రయత్నాన్ని విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మరో సినిమా చేయాలని అనుకున్నారు. ‘మహర్షి’ సినిమా తర్వాత సుకుమార్ – మహేష్ కాంబోలో సినిమా రానున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే కథ రెడీ అయిన తర్వాత ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మహేష్ బాబు స్వయంగా ట్విట్టర్ వేదికగా తాను సుకుమార్ దర్శకత్వంలో నటించడం లేదని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు అనిల్ రావిపూడితో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలానే సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా అనౌన్స్ చేసాడు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా ఉంటుందా అనే అనుమానాలు తలెత్తాయి. తాజాగా వీరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సుకుమార్ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రంలోని సాంగ్ ని మహేష్ బాబు లాంచ్ చేయడం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. అంతేకాకుండా మహేష్ – సుకుమార్ కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ రెడీ చేసిన సుక్కు.. ఇప్పటికే మహేష్ కి వినిపించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళేది తెలియనప్పటికి ఖచ్చితంగా వీరి కాంబోలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఎంమహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తో ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు సుకుమార్ ‘పుష్ప’ తర్వాత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్నాడు.