మాస్ ఎలిమెంట్స్ బాగా దట్టించండమ్మా..!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ను అనౌన్స్ చేసారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే మోషన్ పోస్టర్ లో మహేష్ చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్ లో అదరగొట్టాడు. మహేష్ ఈ సినిమాలో డిఫెరెంట్ గా ట్రై చేస్తున్నాడని అర్థం అవుతోంది.

అయితే మహేష్ కెరీర్లో అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్స్ లో కనిపించిన చిత్రాలు చాలా తక్కువ. అందులోనూ ‘శ్రీమంతుడు’ నుంచి మహేష్ పక్కా మాస్ సినిమా చేయలేదు. అందువల్ల ‘సర్కారు వారి పాట’ సినిమాని సందేశాత్మక అంశాలను జత చేస్తూనే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని డైరెక్టర్ పరశురామ్ పై మహేష్ అండ్ కో ఫుల్ ప్రెజర్ పెడుతున్నారట. అయితే పరశురామ్ కి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చిన సినిమాలు కేవలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో నడిచినవే. పరశురామ్ కమర్షియల్ సినిమాలు తీసినప్పటికి ‘సోలో’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘గీత గోవిందం’ వంటి ఫ్యామిలీ కథలు మాత్రమే ఆడియన్స్ యాక్సప్ట్ చేశారు. మరి మహేష్ ప్రెజర్ తో మాస్ ఎలిమెంట్స్ అంటూ పరశురామ్ ట్రాక్ మారిస్తే శృతి తప్పే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.