సర్కారు వారి పాటలో మహేష్ రెండు షేడ్స్

0

మహేష్ బాబు పోకిరి సినిమాలో రౌడీగా కనిపించినా చివరకు పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఆ తర్వాత అంతటి ట్విస్ట్ తో మహేష్ ఏ సినిమా చేయలేదు. కాని ఇప్పుడు చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అంతకు ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడట. వడ్డీ వ్యాపారిగా మహేష్ కనిపించడంతో పాటు ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలను పెద్దలకు కోట్ల రుణాలు ఇచ్చి వారు ఇవ్వలేకుంటే మాఫీ చేయడం వంటి విషయాలను లేవనెత్తూ పాత్ర సాగుతుందట.

కథలో మహేష్ రెండు విభిన్నమైన షేడ్స్ లో ఎందుకు కనిపించాల్సి వస్తుంది. అసలు కథలో ఉండే ట్విస్ట్ ఏంటీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ సాగుతుంది. అందులో మహేష్ పాత్రపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ నుండి పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. అతి థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు. అన్ని విషయాలకు స్పష్టత రావాలంటే సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది.