సుశాంత్ గొడవలోకి నిర్మాత పేరు ఎందుకు లాగారు?

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి పై విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రియా వెనక షాడో రోల్ అంటూ మహేష్ భట్ పేరును కంగన సహా పలువురు సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. అంతేకాదు.. దివంగత యువ కథానాయిక జియా ఖాన్ నుంచి నేటితరం రియా చక్రవర్తి వరకూ దర్శకనిర్మాత మహేష్ భట్ పేరుతో ముడిపెడుతూ సోషల్ మీడియాల్లో విపరీతంగా ప్రచారం సాగుతోంది.

ఇటీవల రియా చక్రవర్తి మహేష్ భట్ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెటిజనం ట్రోల్ చేశారు. మహేష్ భట్ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. పరిశ్రమకు కొన్ని మరపురాని ప్రేమకథలు ఇచ్చిన సదరు సీనియర్ దర్శకుడిపై ఊహించని కామెంట్లు చేయడం వైరల్ అయ్యింది. అయితే వీటిలో చాలా పుకార్లు మాత్రమేనని అనేవారు లేకపోలేదు.

మేటి నాయిక పర్వీన్ బాబీ- జియా ఖాన్ సహా రియా చక్రవర్తితో పెద్దాయన పేరును లింకప్ చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మహేష్ భట్ రియా భుజంపై వాలిపోతున్న త్రోబ్యాక్ ఫోటోని వైరల్ చేశారు. అయితే సుశాంత్ సింగ్ వ్యవహారంతో ఆయన పేరును లింకప్ చేయడం దేనికి? రంగుల ప్రపంచంలో ఈ గాసిప్ వార్తలు ఎంతవరకూ నిజం? కథానాయికలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయినంత మాత్రాన ఇలా లింకప్ చేసేస్తారా? సుశాంత్ సింగ్ వివాదాస్పద కేసులో వాస్తవం ఏమిటి? అన్నది సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది.