ఛత్రపతి శివాజీ బయోపిక్ లో మహేష్?

0

బయోపిక్ ల ట్రెండ్ అంతకంతకు ఊపేస్తోంది. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తిత్వాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే హిస్టారికల్ కాన్సెప్టుల్ని రాజుల కథల్ని ఎంచుకుని మరీ మన దర్శకనిర్మాతలు అదరగొడుతున్నారు.

ఇంతకుముందు బాలీవుడ్ లో తానాజీ 3డి హిస్టారికల్ కాన్సెప్టుతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ కొలువులో సైన్యాధ్యక్షుడిగా పని చేసిన తానాజీ అనే వీరసైనికుడి వీరగాధతో ఈ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా ఛత్రపతి శివాజీ అజేయమైన వారియర్ స్టోరీతో ఎస్.ఎస్.రాజమౌళి సినిమా తెరకెక్కించనున్నారని గుసగుసలు స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ తరహా కథను లాక్ చేశారని రాజమౌళి తదుపరి చిత్రం ఇదేనని ప్రచారమవుతోంది.

అయితే ఈ మూవీలో కథానాయకుడు ఎవరు? అంటే .. ఇప్పటికే మహేష్ హీరోగా రాజమౌళి సినిమా క్యూలో ఉంది. అంటే ఛత్రపతిగా నటించేది మహేష్ బాబు అని మరో ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే ఇది నిజమా? అంటే ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేనే లేదు. చాలామంది సిల్లీ గాసిప్ అని కొట్టి పారేసినా .. ఈ వార్తలు ఇప్పటివి కావు. ఏడెనిమిది నెలల క్రితం ఓసారి ఇలాంటి కథనాలొచ్చాయి. భరత్ అనే నేను తర్వాత కూడా మహేష్ ఇంటర్వ్యూలో రాజమౌళితో సినిమా ప్రస్థావన తేగా.. ఛత్రపతి జీవితకథలో మహేష్ నటించే వీలుందని గుసగుసలు వినిపించాయి. ఒకవేళ ఇదే నిజమైతే సంచలనమే అవుతుంది. ఛత్రపతికి నార్త్ కనెక్టివిటీ ఉండడం.. సౌత్ లోనూ పాపులారిటీ ఉన్న రారాజు కావడంతో మరో హిస్టారికల్ పాన్ ఇండియాతో జక్కన్న సంచలనాలు సృష్టించడం ఖాయమేనన్న చర్చా వేడెక్కిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఆ రేంజు సినిమా తీయడమే కరెక్ట్ అన్న వాదనా తాజాగా తెరపైకొచ్చింది.