మహేష్ న్యూ లుక్

0

Mahesh new look with Sitara

Mahesh new look with Sitara

ఈ లాక్ డౌన్ టైమ్ ను సెలబ్రెటీలు అంతా కూడా పిల్లలు వారి ఫ్యామిలీస్ తో గడిపేస్తున్నారు. సాదారణంగానే కుటుంబంకు ఎక్కువ సమయం ఇచ్చే మహేష్ బాబు ఈ సమయంలో పూర్తిగా వారితో ఉండి ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబు లాక్ డౌన్ టైమ్ ను మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆయన పిల్లలతో సరదాగా గడుపతున్న వీడియోలు మరియు ఫొటోలను రెగ్యులర్ గా నమ్రత ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూనే ఉంది.

తాజాగా ఈ ఫొటోను షేర్ చేసింది. సితారతో మహేష్ బాబు ఎంజాయ్ మూమెంట్ ను ఈసారి పోస్ట్ చేసింది. సంతోషంగా ఉండటానికి కారణాు అక్కర్లేదు అంటూ నమ్రత నెట్టింట పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. లైట్ గా గడ్డం పెంచిన మహేష్ బాబు విభిన్నంగా కనిపిస్తున్నాడు. సితార ఎప్పటి మాదిరిగానే వావ్ క్యూటీ అనేట్లుగా ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో కాస్త గడ్డంతో కనిపించబోతున్నాడు. కనుక ఈ గడ్డం పెంచి ఉంటాడు అంటున్నారు.