Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆయన చెంతనే ఉంటే నీరసం అన్నదే దరి చేరదు!- మలైకా

ఆయన చెంతనే ఉంటే నీరసం అన్నదే దరి చేరదు!- మలైకా


హిమాలయాల పరిసరాల్లోని పర్యాటక స్థలం ధర్మశాల పావనమైంది. ప్రేమగువ్వల కిలకిలా రావంతో ఆ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. అన్నట్టు ఇక్కడ సంచరిస్తున్న ఆ ప్రేమగువ్వలు ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హాటెస్ట్ పెయిర్ మలైకా అరోరా- అర్జున్ కపూర్ జంట.. స్వేచ్ఛావిహారానికి పనిలో పనిగా షూటింగులకు కూడా ధర్మశాల నెలవైంది.

తాజాగా మలైకా ఓ అందమైన ఫోటోని షేర్ చేసి “మీరు నా చుట్టూ ఉన్నప్పుడు నిస్తేజం (నీరసం) అన్నదే ఉండదు“ అంటూ వ్యాఖ్యను జోడించింది. మలైకా అరోరా ధర్మశాల ట్రిప్ నుండి లవర్ బోయ్ అర్జున్ తో ఉన్నప్పటి తీపి జ్ఞాపకాన్ని ఇలా పోటో రూపంలో పంచుకున్నారు. ప్రియుడితో స్వీట్ మెమరీని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ లతో కలిసి ఈ జంట కూడా ఇటీవల ధర్మశాల పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి పెయిర్ కి సంబంధించిన ఫోటోలు రివీలయ్యాయి.

ఈ విహారయాత్రకే హైలైట్ గా నిలిచిన వాటిలో అర్జున్తో రొమాంటిక్ గా ఉన్న ఫోటోని మలైకా పంచుకుంది. మలైకా కొద్ది రోజుల క్రితం ముంబైకి తిరిగి రాగా.. అర్జున్ తన చిత్రం భూత్ పోలీస్ షూట్ కోసం పర్యాటక కేంద్రంలోనే ఉన్నాడు. ఐ యాక్సెప్ట్ అంటూ అర్జున్ తనకు రిప్లయ్ ఇచ్చాడు స్వీట్ గా. ఈ ప్రేమజంట స్నేహితులు అభిమానులు కూడా చాలా మంది చిత్రాన్ని ఇష్టపడ్డారు. అర్జున్ మామ సంజయ్ కపూర్ ప్రతిస్పందిస్తూ హార్ట్ ఎమోజీని షేర్ చేశారు. ధర్మశాలలోనే మలైకా- అర్జున్ జంట సహా ఇతర జంటలు దీపావళిని జరుపుకోవడం ఆసక్తికరం. అర్జున్ మూవీ యూనిట్ సభ్యులు యామి గౌతమ్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ధర్మశాలలో ఉన్నారు.