మాళవిక లా చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య!

0

మత్తు కళ్లతో చిత్తు చేయడం కొందరికే తెలిసిన విద్య. ఇటీవలి కాలంలో ఊహాతీతంగా తారా లోకంలోకి దూసుకొచ్చిన మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇందులో ఎక్స్ పర్ట్. ఇక ఈ అమ్మడు ర్యాంప్ షోస్ వీక్షించిన వారికి ప్రత్యేకించి మత్తు కళ్ల వ్యవహారం గురించి పరిచయం చేయనక్కర్లేదు.

ఆ విషయంలో షో స్టాపర్ ఈ అమ్మడు. గత కొంతకాలంగా ఇన్ స్టాలో మాళవిక మోహనన్ షేర్ చేసిన ఫోటోషూట్లు చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న ఓనం పండగరోజు రెడ్ హాట్ శారీలో దర్శనమిచ్చిన మాళవిక.. ఆ తర్వాత హీట్ పెంచే ఫోటోషూట్ తో అభిమానులను స్టన్నయ్యేలా చేసింది. ప్రఖ్యాత జేఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీపై తళుకుబెళుకులతో హుషారెత్తించింది.

తాజాగా మాళవిక స్టన్నింగ్ ఫోటో ఒకటి అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది. ఇక ఇందులో గాగుల్స్ పెట్టుకున్న ఈ భామ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. స్టన్నింగ్ పొట్టి ఫ్రాకులో మతి చెదిరే ట్రీటిచ్చింది. ఇక కెరీర్ పరంగా చూస్తే ఈ అమ్మడు ప్రస్తుతం విజయ్ సరసన మాస్టర్ లో నటించింది. తదుపరి టాలీవుడ్ లో బిగ్ అప్ డేట్ ఉంటుందని సమాచారం.