పవన్ కళ్యాణ్ సరసన నేను నటించట్లేదు:మానస రాధాకృష్ణన్

0

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ ‘గబ్బర్ సింగ్’ టీమ్ మరోసారి తెరమీదకు రానున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా జోరు కంటిన్యూ చేస్తున్నారు. గతేడాది ఏకంగా 13 మిలియన్ల ట్వీట్స్ తో సోషల్ మీడియాలో మోత మోగించారు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్.. ఆల్రెడీ పవర్ స్టార్ తో కొత్త సినిమా ప్రకటించాడు. ఇక ఈ కొత్త సినిమా గబ్బర్ సింగ్ కాంబినేషన్ లోనే రూపొందనుంది. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దేవి శ్రీ ప్రసాద్ మరోసారి కలిసి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఆ మధ్యలో ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ హరీష్ శంకర్ పోస్ట్ చూసి అందరూ కొత్త సినిమా టైటిల్ ఇదే కావచ్చు అని ఊహాగానాలు వ్యక్తం చేశారు. కానీ అలాంటిది ఏమి లేదన్నట్లు హరీష్ శంకర్ సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం సినిమా టైటిల్ సంచారి అనేది ప్రచారం జరుగుతుంది. అయితే పవర్ స్టార్ 28వ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరబ్బా.. అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదివరకే మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్ పూజాహెగ్డే అంటూ వార్తలొచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే హరీష్ శంకర్ కొత్త ముఖాన్ని పరిచయం చేయాలనీ చూస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా కథనాల ప్రకారం.. మలయాళ కుర్రబ్యూటీ మానస రాధాకృష్ణన్ ను ఫైనల్ చేయాలనీ భావిస్తున్నట్లు వార్తలు హల్చల్ చేసాయి. ఆ రూమర్స్ తోనే మానసను ఫేమస్ చేసేసారు పవర్ స్టార్ అభిమానులు. కానీ ఇటీవలే మానస ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు సమాచారం. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళం తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీని చూస్తే ఎవరైనా చూడముచ్చటగా ఉందని అనాల్సిందే. ఒకవేళ టాలీవుడ్ లో అడుగుపెడితే మాత్రం కృతిశెట్టిలాగే ఈమెకు కూడా గ్రాండ్ ఎంట్రీ లభిస్తుంది. అయితే మానస వయసు ఇంకా 21 మాత్రమే. తాజాగా స్పందించి.. ‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. కానీ ఆయన సినిమాల్లో నటించట్లేదని’ క్లారిటీ ఇచ్చేసింది. ఆ విధంగా పుకార్లకు బ్రేక్ పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హైలైట్ అవుతోంది.