 క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ”శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శకుంతలగా అక్కినేని సమంత.. దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈరోజు సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే అభిజ్ఞాన శాకుంతలంలో కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అభిజ్ఞాన శాకుంతలం కథలో దుర్వాస మహర్షి ముక్కోపిగా ప్రసిద్ధి. క్షణికావేశంలో శపించడం.. మళ్ళీ కోపం చెల్లారగానే ఆ శాపానికి విరుగుడు చెప్పడం చేస్తుంటాడు. భర్త కోసం ఎదురుచూస్తూ పరధ్యానంలో ఉండిపోయిన శకుంతల తనను పట్టించుకోలేదన్న కోపంతో శపించి ఆమెను భర్త దుష్యంత మహారాజు మర్చిపోయేలా చేస్తాడు. ఇలా శకుంతల జీవితాన్ని మలుపుతిప్పే దుర్వాస ముని పాత్రలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిస్తున్నారని సమాచారం. నిజానికి నిజజీవితంలో మోహన్ బాబుకు ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా పోతుందనే టాక్ ఉంది. అందుకేనేమో ఇప్పుడు ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా వుండే ఈ పాత్రకు మోహన్ బాబుని ఎంచుకుంటున్నాడు గుణశేఖర్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఇకపోతే ‘శాకుంతలం’ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో డీఆర్పీ – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు.. సినిమాకి పని చేసే ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets