మంచు వారి లిటిల్ ఏంజిల్ బర్త్ డే

0

మంచు వారి ఇంట బర్త్ డే వేడుక వైభవంగా జరిగింది. మంచు విష్ణు నాల్గవ సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజును కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కరోనా కారణంగా బయటి అతిధులను ఎవ్వరిని ఆహ్వానించలేదు. మంచు వారి ఫ్యామిలీ వారు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో అంతా కూడా ఒక డ్రస్ కోడ్ ను పాటించడం ఇక్కడ చూడవచ్చు. లేడీస్ అంతా పింక్ అండ్ వైట్ డ్రస్ లు ధరించగా మగవారు వైట్ షర్ట్స్ ను ధరించారు.

మంచు వారి ఇంటికి చెందిన ఈ లిటిల్ క్యూట్ ఏంజిల్ కు ఎంతో మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తీసుకున్న ఫొటోలు అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా మంచు వారు షేర్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మంచు వారి ఫ్యామిలీ ఫొటో కన్నుల వింధుగా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు దంపతులకు నలుగురు సంతానం కాగా మొదటి ఇద్దరు కవలలు ఆ తర్వాత బాబు అవ్రామ్ భక్త జన్మించారు. ఆ తర్వాత నాల్గవ సంతానంగా ఐరా విద్యా జన్మించిన విషయం తెల్సిందే. మంచు విష్ణు సంతానంపై రకరకాలుగా కామెంట్స్ వచ్చినా కూడా ఆ ఫ్యామిలీ మాత్రం పిల్లలతో కలకలలాడుతోంది. ఈ ఫొటోలను చూస్తుంటే అది తెలుస్తుంది.