పొట్టి నిక్కరులో దిశా బ్యూటీ తందనాలు

0

చిట్టి పొట్టి నిక్కరులో చిలౌట్ చేయడం సీకే బ్యూటీ దిశా పటానీకి కొత్తేమీ కాదు. బికినీ.. స్విమ్ సూట్ .. లోదుస్తులు కాదేదీ పబ్లిసిటీకనర్హం! అన్న చందంగా చెలరేగుతుంది. పొదుపుగా వస్త్రాల్ని ధరించడం వీనుల విందుగా పసందుకు రెడీ కావడం అన్నది తన వృత్తిలో భాగం. తాజా సన్నివేశం చూస్తుంటే ఏదో షూటింగ్ లో తలమునకలుగా ఉన్న లోఫర్ బ్యూటీ ఇదిగో ఇలా సైడుకొచ్చి ఏం చేస్తోందో చూశారుగా!

టాప్ టు బాటమ్ తనివి తీరా వీక్షించండి.. ఎందులోనూ తగ్గను… నేనుప్పుడూ ఇంతే! అన్నట్టుగా ఆ ఫేస్ ని అలా అదోలా పెట్టి మరీ ఫోటోకి ఫోజిచ్చింది. పైన ఒక పేలిక కిందొక డెనిమ్ పేలిక కనిపిస్తున్నాయంతే. టాప్ ని కవర్ చేసేందుకు వైట్ లూజ్ షర్ట్ తొడుక్కుంది. చిట్టి పొట్టి డెనిమ్ షార్ట్ లో దుంప తెంచేసింది.

కెరీర్ సంగతి చూస్తే.. వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. మోహిత్ సూరి థ్రిల్లర్ మలంగ్ ఇటీవలే రిలీజైంది. అనిల్ కపూర్- ఆదిత్య రాయ్ కపూర్ – కునాల్ కెమ్ము లతో కలిసి నటించింది. ప్రభుదేవా – సల్మాన్ కాంబినేషన్ మూవీ `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` లో కనిపించనుంది. సల్మాన్ ఖాన్ తో దిశాకు రెండవ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్.. రణదీప్ హుడా నటించనున్నారు.

బాలీవుడ్లోకి ప్రవేశించే ముందు దిశా పటాని మోడల్. స్పోర్ట్స్ బయోపిక్ `ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకుముందు తెలుగు సినిమా లోఫర్ లో నటించింది. భాఘి2- కుంగ్ ఫూ యోగా వంటి చిత్రాల్లో కూడా దిశా నటించింది.