Templates by BIGtheme NET
Home >> Cinema News >> పోస్టర్ కాపీ అయితే మరి సినిమా..?

పోస్టర్ కాపీ అయితే మరి సినిమా..?


యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు మరియు కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ఆయన ఇప్పటికే ప్రకటించాడు. తెలుగులో ఇప్పటి వరకు జాంబీ జోనర్ లో సినిమాలు రాలేదు. ఇదే మొదటి సినిమా అంటూ ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకు జాంబీ జోనర్ అంటే ఏంటా అంటూ చాలా మంది నెట్టింట శోదించే పనిలో ఉన్నారు. ఈ సమయంలో కొందరు జాంబీ రెడ్డి సినిమా లోగో పోస్టర్ కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హాలీవుడ్ లో గతంలో వచ్చిన కొన్ని యాక్షన్ సినిమాల పోస్టర్ లను పోలి ఈ పోస్టర్ ఉందని అంటున్నారు. జాంబీ రెడ్డి పోస్టర్ ను పోలిన కొన్ని పోస్టర్స్ ను నెటిజన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సమయంలో కాపీ పోస్టర్ అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ తో సినిమా అయినా కొత్తగా ఉంటుందా లేదంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టావా అంటూ ప్రశాంత్ వర్మను ప్రశ్నిస్తున్నారు.

అ! మరియు కల్కి చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ఆ మద్య దటీజ్ మహాలక్ష్మి సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. మద్యలో ఆగిన ఆ సినిమాను ఈయన పూర్తి చేశాడు. కనుక ఆ సినిమా క్రెడిట్ ఈయన తీసుకోవడం లేదు. జాంబీ రెడ్డితో ఒక విభిన్నమైన తెలుగు ప్రేక్షకులు ఇచ్చి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఈయన ఆశపడుతున్నాడు. మరి ఈయన జాంబీ రెడ్డి ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుందో చూడాలి.