నేనున్నానంటూ సాయంకు ముందుకు వచ్చిన మనోజ్

0

సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరిస్తూ ఉంటారు. ఇక కొందరు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో అందరికి తెలిసే విధంగా షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా నందమూరి అభిమానులు ఒక కుర్రాడికి బోన్ క్యాన్సర్ ఉందని అతడి తండ్రి ఆర్థికంగా ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితుల్లో లేడు. మన నందమూరి అభిమానులు ఆయనకు చేతనైనంత సాయం చేద్దాం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

సోషల్ మీడియాలోన ఆ పోస్ట్ ను చూసిన మంచు మనోజ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తనను ఎవరు ట్యాగ్ చేయకున్నా కూడా తన వంతు బాధ్యత అనుకుని ఆ బాబుకు సంబంధించిన ట్రీట్ మెంట్ విషయంలో తాను సాయం చేస్తానంటూ ప్రకటించాడు. హాస్పిటల్ పేరు.. డాక్టర్ పేరును నాకు మెసేజ్ చేయండి. నేను సాయంగా నిలుస్తానంటూ హామీ ఇచ్చాడు. మంచు మనోజ్ నుండి సాయంకు సంబంధంచిన హామీ రావడంతో నందమూరి మరియు మంచు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.