వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి మరో డైరెక్టర్…?

0

కెరీర్ స్టార్టింగ్ లో ‘ఈ రోజుల్లో’ ‘బస్ స్టాప్’ వంటి యూత్ ఫుల్ మసాలా ఫిల్మ్ తీసిన డైరెక్టర్ మారుతి.. ఆ తర్వాత రూట్ పూర్తిగా మార్చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తీసి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే లాక్ డౌన్ సమయంలో మారుతి ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి.

అల్లు అరవింద్ సారథ్యంలోని ‘ఆహా’ ఓటీటీ కోసం మారుతి.. యూత్ ఫుల్ కంటెంట్ తో ఓ వెబ్ సిరీస్ ని రూపొందించనున్నాడట. యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఓ హ్యూమర్ స్టోరీతో ఈ వెబ్ సిరీస్ రెడీ కానుందని సమాచారం. అయితే ఈ సిరీస్ ని మారుతి సొంతగా నిర్మించనున్నారట. ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మారుతి.. ఇప్పుడు వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లోకి కూడా దిగుతున్నాడట. ఇదిలా ఉండగా మాస్ మహారాజా రవితేజతో మారుతి ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.